నా వెంట పడి నువ్వెంత ఒంటరివనొద్దు..

రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, చిత్రం: జాను

ఏదారెదురైనా, ఎటు వెళ్తుందో అడిగానా.. ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా…

ఏం చూస్తూ ఉన్నా, నే వెతికానా ఏమైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా..

కదలని ఓ శిలనే అయినా, తృటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితె నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా, ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా..

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ, ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు..

నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుస గుస కబురుల ఘుమఘుమలెవరివి..

ఉదయం కాగానే, తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇపుడే నను కనగా, అనగనగా, అంటూనే ఉంటా, ఎపుడూ పూర్తవనే అవక, తుది లేని కధ నేనుగా..

గాలివాటం లాగా, ఆగే అలవాటే లేక, కాలు నిలవదు ఏ చోట, నిలకడగా, ఏ చిరునామా లేక, ఏ బదులూ పొందని లేఖ, ఎందుకు వేస్తోందో కేకా..మౌనంగా..

నా వెంటపడి…నా ఊపిరిని..

లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం, నాకే సొంతం అనుకున్నా, విన్నారా, నేనూ నా నీడా, ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరైనా..

ఆమ్మ ఒడిలో మొన్న, అందని ఆశలతో నిన్న, ఎంతో ఊరిస్తూ ఉంది, జాబిల్లి,అంత దూరానున్నా, వెన్నెలగా చెంతనె ఉన్నా, అంటూ ఊయలలూపింది, జోలాలి..

తానే తానే నానెనే, తానే తానే నానెనే,
తానే తానే నానెనే, తానే తానే నానెనే,

తానే తానే నానెనేఏఏఏఏ….

సీతారామ శాస్త్రి గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.. ఆయన లేని లోటు తీర్చలేనిది.

శ్రీ ఆంజనేయం…

చిత్రం – ఊసరవెల్లి, రచన – సీతారామ శాస్త్రి గారు.

శ్రీ ఆంజనేయం, భజే వజ్రకాయం, సదా రక్షగా కాపాడనీ నీ నామధేయం..శ్రీ ఆంజనేయం, భజే వాయుపుత్రం, సదా అభయమై అందించరా నీ చేతి సాయం..

ఓ..భజరంగభళి, దుడుకున్నదిగా నీ అడుగులలో, నీ.. సరి లేరని చూపర ఆశయసాధనలో…ఓ తప మానసిక, పెను సాహసముందిగ పిడికిలిలో, లే.. పని చెప్పర దానికి విషమ పరీక్షలలో..

స్ఫురణ తెచ్చుకొని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును దించగ రా.. నివురునొదిలి శివ ఫాలనేత్రమై దనుజ దహనమున కై దూసుకురా..

స్ఫురణ తెచ్చుకొని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును దించగ రా.. నివురునొదిలి శివ ఫాలనేత్రమై దనుజ దహనమున కై దూసుకురా..

శ్రీ ఆంజనేయం, భజే వజ్రకాయం, దండించాలి రా దండధారివై దుండగాల దౌష్ఠ్యం…శ్రీ ఆంజనేయం, భజే వాయుపుత్రం, పూరించాలిరా నీ శ్వాస తో ఓంకార శంఖం..

ఆ..బ్రహ్మాస్త్రము సైతం వమ్మవదా నీ సన్నిథి లో.. ఆ..యమపాశమె పూదండవదా నీ మెడలో….నీ..వు నమ్మిన తారక మంత్రము ఉన్నది హృదయములో.. అదే.. రహదారిగ మార్చద కడలిని పయనం లో..

శ్రీ ఆంజనేయం, భజే వజ్రకాయం, సదా రక్షగా కాపాడనీ నీ నామధేయం..భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం, సదా అభయమై అందించరా నీ చేతి సాయం..

సాహసం నా పథం…

చిత్రం – మహర్షి. రచయిత – సీతారామ శాస్త్రి గారు.

సాహసం నా పథం, రాజసం నా రథం, సాగితే ఆపటం సాధ్యమా..

పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, కైవసం కావటం కష్ఠమా..లోకమే బానిసై చేయదా ఊడిగం, శాసనం దాటటం శక్యమా..

నా పదగతిలో ఏ ప్రతిఘటన, ఈ పిడికిలిలో, తానొదుగునుగా.

సాహసం నా పథం, రాజసం నా రథం, సాగితే ఆపటం సాధ్యమాఆఆఆ…..

నిశ్చయం, నిశ్చలం..హహ. నిర్భయం, నా హయం..హహ..

ఆఆఆఆఆఆ…..ఆఆఆఆఆఆఆ

కానిదేముంది నే కోరుకుంటే, పూని సాధించుకోనా..లాభమేముంది కలకాలముంటే, కామితం తీరకుండా..

తప్పని,ఒప్పని, తర్కమే చెయ్యను, కష్ఠమో నష్ఠమో లెక్కనే వెయ్యను..

ఊరుకుంటే కాలమంతా, జారిపోదా ఊహవెంట.. నే మనసు పడితే, ఏ కళలనైనా, ఈ చిటిక కొడుతూ, నే పిలవనా.

సాహసం నా పథం, రాజసం నా రథం, సాగితే ఆపటం సాధ్యమా, పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, కైవసం కావటం కష్ఠమా..

అదరని, బెదరని ప్రవృత్తి,  ఒదగని మదగజమే మహర్షి..

ఆఅఆఅఆఅఅఅఆఆ….ఆఆఆఆఆఆ

వేడితే లేడి ఒడి చేరుతుందా, వేట సాగాలి కాదా..హహ..ఓడితే జాలి చూపేనా కాలం, కాలరాసేసి పోదా..

అంతమో, సొంతమో, పంతమే వీడను, మందలో పందలా ఉండనే ఉండను..భీరువల్లే పారిపోను, రేయి ఒళ్ళో దూరిపోను..నే మొదలుపెడితే ఏ సమరమైనా, నాకెదురుపడునా ఏ అపజయం..

సాహసం నా పథం, రాజసం నా రథం, సాగితే ఆపటం సాధ్యమా, పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, కైవసం కావటం కష్ఠమా..లోకమే బానిసై చేయదా ఊడిగం, శాసనం దాటటం శక్యమా..నా పదగతిలో ఏ ప్రతిఘటన, ఈ పిడికిలిలో, తానొదుగునుగా…

తకిటఝం, తరితఝం, తణతఝం, ఝంతఝం,తకిటఝం, తరితఝం,ఝంతఝం..ఉ..

సిరి’వెన్నెల’ శాస్త్రి గారి చల్లని వెన్నెల సిరి

శాస్త్రి గారు రాసిన ఒక హృద్యమైన గీతం తో ప్రారంభిస్తాను. ఆయన మనస్సు నుంచి జారి కలం పట్టుకోగలిగిన అక్షరామృతమే ఇక్కడికి వచ్చిన మీకు నేనిచ్చే స్వాగత తేనీటి విందు.

ఈ పాట ‘చక్రం’ చిత్రం లోనిది.

పల్లవి:

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా..
ఒకే ఒక మాట.. పెదవోపలేనంత తియ్యంగా..
నా పేరు నీ ప్రేమనీ.. నా దారి నీ వలపనీ..
నా చూపు నీ నవ్వనీ.. నా ఊపిరే నువ్వనీ..
నీకు చెప్పాలనీ..

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా..
ఒకే ఒక మాట.. పెదవోపలేనంత తియ్యంగా..

చరణం 1:

నేను అనీ లేను అనీ చెబితె ఏం చేస్తావు..
నమ్మననీ.. నవ్వుకొనీ.. చాల్లె పొమ్మంటావు..
నీ మనసులోని ఆశగా.. నిలిచేది నేననీ..
నీ తనువులోని స్పర్శగా.. తగిలేది నేననీ..
నీ కంటి మైమరుపులో.. నను పోల్చుకుంటాననీ..
తల ఆన్చి నీగుండెపై.. నా పేరు వింటాననీ..నీకు చెప్పాలని..

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా..
ఒకే ఒక మాట.. పెదవోపలేనంత తియ్యంగా..

చరణం 2:

నీ అడుగై..నడవడమే. పయనమన్నది పాదం..
నిను విడిచి.. బ్రతకడమే.. మరణమన్నది ప్రాణం..
నువురాకముందు జీవితం.. గురుతైనలేదనీ..
నిను కలుసుకున్న ఆ క్షణం.. నను వదిలిపోదనీ..
ప్రతి ఘడియ ఓ జన్మ గా.. నే గడుపుతున్నాననీ..
ఈ మహిమ నీదేననీ.. నీకైన తెలుసా అనీ..
నీకు చెప్పాలని..

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా..
ఒకే ఒక మాట.. పెదవోపలేనంత తియ్యంగా..
నా పేరు నీ ప్రేమనీ.. నా దారి నీ వలపనీ..
నా చూపు నీ నవ్వనీ.. నా ఊపిరే నువ్వనీ..
నీకు చెప్పాలనీ..