సిరి’వెన్నెల’ శాస్త్రి గారి చల్లని వెన్నెల సిరి

శాస్త్రి గారు రాసిన ఒక హృద్యమైన గీతం తో ప్రారంభిస్తాను. ఆయన మనస్సు నుంచి జారి కలం పట్టుకోగలిగిన అక్షరామృతమే ఇక్కడికి వచ్చిన మీకు నేనిచ్చే స్వాగత తేనీటి విందు.

ఈ పాట ‘చక్రం’ చిత్రం లోనిది.

పల్లవి:

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా..
ఒకే ఒక మాట.. పెదవోపలేనంత తియ్యంగా..
నా పేరు నీ ప్రేమనీ.. నా దారి నీ వలపనీ..
నా చూపు నీ నవ్వనీ.. నా ఊపిరే నువ్వనీ..
నీకు చెప్పాలనీ..

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా..
ఒకే ఒక మాట.. పెదవోపలేనంత తియ్యంగా..

చరణం 1:

నేను అనీ లేను అనీ చెబితె ఏం చేస్తావు..
నమ్మననీ.. నవ్వుకొనీ.. చాల్లె పొమ్మంటావు..
నీ మనసులోని ఆశగా.. నిలిచేది నేననీ..
నీ తనువులోని స్పర్శగా.. తగిలేది నేననీ..
నీ కంటి మైమరుపులో.. నను పోల్చుకుంటాననీ..
తల ఆన్చి నీగుండెపై.. నా పేరు వింటాననీ..నీకు చెప్పాలని..

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా..
ఒకే ఒక మాట.. పెదవోపలేనంత తియ్యంగా..

చరణం 2:

నీ అడుగై..నడవడమే. పయనమన్నది పాదం..
నిను విడిచి.. బ్రతకడమే.. మరణమన్నది ప్రాణం..
నువురాకముందు జీవితం.. గురుతైనలేదనీ..
నిను కలుసుకున్న ఆ క్షణం.. నను వదిలిపోదనీ..
ప్రతి ఘడియ ఓ జన్మ గా.. నే గడుపుతున్నాననీ..
ఈ మహిమ నీదేననీ.. నీకైన తెలుసా అనీ..
నీకు చెప్పాలని..

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా..
ఒకే ఒక మాట.. పెదవోపలేనంత తియ్యంగా..
నా పేరు నీ ప్రేమనీ.. నా దారి నీ వలపనీ..
నా చూపు నీ నవ్వనీ.. నా ఊపిరే నువ్వనీ..
నీకు చెప్పాలనీ..