తెలుగు హాస్య సామెతలు – 2

ఈ శీర్షిక యొక్క మొదటి భాగం ఈ కింద లింక్ ద్వారా చదవచ్చు.

https://telugumaata.in/2024/09/17/telugu-haasya-saamethalu/

1. టెంకాయ చెట్టు ఎందుకెక్కినావురా అంటే దూడగడ్డికి అన్నాడట

2. తడిక లేని ఇంట్లోకి కుక్క దూరినట్టు

3. విసర్రాయే గాలికి కొట్టుకుపోతుంటే విస్తరాకు సంగతి చెప్పాలా?

4.మా ఇంటాయనకి ఎంత మతిమరుపంటే నీళ్ళలో పడి ఈదడం మర్చిపోయాడు.

5. పంచ పాండవులంటే నాకు తెలియదా? మంచం కోళ్ళ వలె ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించి ఒకటి మడిచాడట.

6. అడవి పంది చేను మేసి పోతే ఊర పంది చెవులు కోసినట్టు.

7. అత్తకు లేక అటుకులు నాకుతుంటే అల్లుడు వచ్చి దసరా పండుగ అన్నాడట.

8. ఇల్లు కాలి ఇల్లాలు ఏడుస్తుంటే బొగ్గుల వ్యాపారి బేరానికి వచ్చాడట.

9. ఎద్దులాగున్నావు తేలు మంత్రం ఎరుగవా అన్నాడట.

10. ఎందుకు ఏడుస్తున్నావురా కొడకా అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతుందని అన్నాడట.

11. నాన్పుడు గాడు నా పెళ్ళికి నేను వెళ్ళాలా అడిగాడట.

12. నా చెయ్యి నొస్తున్నది, నీ చేత్తో మొత్తుకో (మొట్టికాయలు).

13. నాకింత గంజి పోస్తావా నీకు ఆకలి లేకుండా చేస్తా అన్నాడట.

14. దొంగకు తలుపు తీసి దొరను లేపే వాడు.

15. జీతం లేకుండా తోడేలు గొఱ్ఱెలు కాస్తా అనిందట.

ఏ తీరుగ నను దయజూచెదవో…

శ్రీ రామదాసు కీర్తన:

ఏ తీరుగ నను దయజూచెదవో, ఇనవంశోత్తమ రామా..

ఏ తీరుగ నను దయజూచెదవో, ఇనవంశోత్తమ రామా..నా తరమా, భవసాగరమీదను..నళిన దళేక్షణ రామా..

శ్రీ రఘునందన సీతా రమణ, శ్రిత జన పోషక రామా..కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా..

క్రూర కర్మములు నేరక జేసితి, నేరములెంచకు రామా..దారిద్ర్యము పరిహారము సేయవె, దైవ శిఖామణి రామా..

స్వాగతం🙏🏻

వనం అనే పదానికి అర్థాలు – అడవి, ఇల్లు,గుంపు,ఇంకా మరికొన్ని. ఉపవనం అంటే తోట.

ఈ ప్రదేశం తెలుగుకి తోట, ఇల్లు అనే భావంతో ఆరంభించాను.

ఈ తెలుగు తోటకి వచ్చిన భాషా ప్రేమికులకు, భాషామృత పిపాసులకు, నా నమస్సుమాంజలి🙏🏻🙏🏻. చదవడానికి కుడి వైపున (లేదా కింద) ఉన్న పీఠిక చూడండి.

నాకు ఆలోచించగలిగి, వ్రాయగలిగిన శక్తి ఇచ్చి, నా భాషాభిమానానికి కారకులైన నా తల్లిదండ్రులకు నా శతకోటి వందనాలు🙏🏻🙏🏻🙏🏻

వాగర్థావివ సంప్రుక్తౌ వాగర్థ ప్రతిపత్తయే..

జగతః పితరౌ వందే, పార్వతీ పరమేశ్వరౌ🙏🏻..

వందే పార్వతీప, రమేశ్వరౌ🙏🏻.