మండే మంటే తీరు…

చిత్రం: కేశవ

మండే మంటే తీరు, చల్లార్చదు కన్నీరు..

అడిగేవారే లేరు, ఏమైందని ఓ మారు..

గుండెల్లో కంగారు, వివరంగా వినలేరు..,

చూస్తూనే ఉంటారు, అంతే లోకంతీరు..

ఏడిస్తే రారెవరూ, తీర్చరుగా బాధెవరూ, బాధను ఉరి తీస్తారు, బతికెయ్మని అంటారు..

ఓదార్పే వద్దని బతికేలా, ధైర్యం పిడికిలి ఉంటే చాలా..

తడికన్నుల ఆవిరి కరిగేలా, అన్నీ మరి నువ్వే మొయ్యాలా ఆఆఆ..

నా వెంట పడి నువ్వెంత ఒంటరివనొద్దు..

రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, చిత్రం: జాను

ఏదారెదురైనా, ఎటు వెళ్తుందో అడిగానా.. ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా…

ఏం చూస్తూ ఉన్నా, నే వెతికానా ఏమైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా..

కదలని ఓ శిలనే అయినా, తృటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితె నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా, ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా..

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ, ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు..

నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుస గుస కబురుల ఘుమఘుమలెవరివి..

ఉదయం కాగానే, తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇపుడే నను కనగా, అనగనగా, అంటూనే ఉంటా, ఎపుడూ పూర్తవనే అవక, తుది లేని కధ నేనుగా..

గాలివాటం లాగా, ఆగే అలవాటే లేక, కాలు నిలవదు ఏ చోట, నిలకడగా, ఏ చిరునామా లేక, ఏ బదులూ పొందని లేఖ, ఎందుకు వేస్తోందో కేకా..మౌనంగా..

నా వెంటపడి…నా ఊపిరిని..

లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం, నాకే సొంతం అనుకున్నా, విన్నారా, నేనూ నా నీడా, ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరైనా..

ఆమ్మ ఒడిలో మొన్న, అందని ఆశలతో నిన్న, ఎంతో ఊరిస్తూ ఉంది, జాబిల్లి,అంత దూరానున్నా, వెన్నెలగా చెంతనె ఉన్నా, అంటూ ఊయలలూపింది, జోలాలి..

తానే తానే నానెనే, తానే తానే నానెనే,
తానే తానే నానెనే, తానే తానే నానెనే,

తానే తానే నానెనేఏఏఏఏ….

సీతారామ శాస్త్రి గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.. ఆయన లేని లోటు తీర్చలేనిది.

తెలుగు సామెతలు – 2

  1. చెప్పుడు మాటలకన్నా తప్పుడు మాటలు నయం.
  2. చెరకురసము కన్నా చెలిమాట తీపిరా.
  3. చెరుకా! బెల్లం పెట్టమంటే పెడుతుందా?
  4. చెరువు ఎండితే చేపలు బయట పడతాయి.
  5. చెలిమితో చేదు తినిపించవచ్చు కానీ బలిమి తో పాలు తాగించలేము.
  6. చేసిన పాపం గోచీలో పెట్టుకొని కాశీకి పోయినా తీరదు, కాటికి పోయినా తీరదు.
  7. రాగల శని రామేశ్వరం వెళ్ళినా తప్పదు.
  8. రాగి పోగులు తగిలించుకున్నావేమిరా? అంటే నీకు అవి కూడా లేవు కదా అన్నాడట.
  9. పతిభక్తి చూపిస్తాను మగడా!,చెప్పులుతే, నిప్పులు తొక్కుతాను అందిట.
  10. ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుడతారంటే చుట్టుచుట్టుకీ కడుపు చూసుకునేదట.
  11. పని అంటే ఒళ్ళుమంట, తినడమంటే ఇష్టమంట.
  12. పరుగెత్తేవాణ్ణి చూస్తే తరిమేవాడికి లోకువ.
  13. పగవాడ్ని పంచాంగమడిగితే మధ్యాహ్నానికి మరణమన్నాడట.
  14. పాడువూళ్ళో పొగిడేవారు లేరు, నన్ను నేనే పొగుడుకుంటా అన్నట్టు.
  15. పనిచెయ్యని వానికి ప్రగల్భాలెక్కువ.
  16. మీద మెరుగులు, లోన పురుగులు.
  17. మీ ఇంట్లో తిని మా ఇంట్లో చెయ్యి కడుక్కోమన్నట్టు.
  18. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు.

ఈ శీర్షిక లో దీనికి ముందు రాసినది ఈ కింద లింక్ ద్వారా చదవచ్చు:

https://telugumaata.in/2024/10/03/telugu-haasya-saamethalu-2/

పదర పదర పదరా..

చిత్రం – మహర్షి (కొత్తది), రచన – శ్రీమణి గారు.

భళ్లుమంటు నింగి వొళ్ళు విరిగెను గడ్డిపరకతోన, ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే, శిరస్సు వంచి శిఖరమంచు ముట్టిడె మట్టి నేలనే..

పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చేయి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా..

పదర పదర పదరా, ఈ పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా..

ఓఓఓఓఓఓఓ.. ఓఓఓఓఓఓఓ…

నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పథమున మొదటడుగేయి రా, నీ తరమిదిరా అనితరమిదిరా అని చాటెయిరా..

పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చేయి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా..

పదర పదర పదరా, ఈ పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా..

ఓఓఓ భళ్లుమంటు నింగి వొళ్ళు విరిగెను గడ్డిపరకతోన, ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే, శిరస్సు వంచి శిఖరమంచు ముట్టిడె మట్టి నేలనే..

కదిలే ఈ కాలం,తన రగిలే వేదనకి, బదులల్లె విసిరిన ఆశల బాణం నువ్వేరా..పగిలే ఇల హృదయం, తన యెదలో రోదనకి, వరమల్లె దొరికిన ఆఖరి సాయం నువ్వేరా..

కనురెప్పలలో తడి ఎందుకని, తననడిగేవాడే లేక, విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా..

పదర పదర పదరా, ఈ హలమును భుజముకెత్తి పదరా, ఈ భూమిని యెదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా,

పదర పదర పదరా, ఈ వెలుగను పలుగు దించి పదరా, పగుళ్ళతో పనికిరానిదను బ్రతుకు భూములను మెతుకులిచ్చు పదరా..

ఏఏఏఏఏఏఏఏ….ఏఏఏఏఏఏఏఏఏ…

ఏఏఏఏఏఏఏఏ….ఏఏఏఏఏఏఏఏఏ…

నీలో ఈ చలనం, మరి కాదా సంచలనం, చినుకల్లె మొదలై ఉప్పెన కాదా ఈ కథనం,

నీలో ఈ జడికి, రేగే అలజడికి, గెలుపల్లె మొదలై చరితగా మారే నీ పయనం..

నీ ఆశయమే తమ ఆశ అని, తమ కోసమని తెలిసాక, నువ్వు లక్ష్యమని, తమ రక్ష అని నినదించేరా..

పదర పదర పదరా, నీ గతముకు కొత్త జననమిదిరా, నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలి పునాది గది తలుపు తెరిచి పదరా..

పదర పదర పదరా, ప్రతొక్కరి కధవు నువ్వు కదరా, నీ ఒరవడి భవిత కలల ఒడి బతుకు సాధ్యపడు సాగుబడికి బడిరాఆఆఆఆఆ..

తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం,

తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం,

ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతి చుక్కవో,

తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవోఓఓఓ..

తెలుగు హాస్య సామెతలు – 2

ఈ శీర్షిక యొక్క మొదటి భాగం ఈ కింద లింక్ ద్వారా చదవచ్చు.

https://telugumaata.in/2024/09/17/telugu-haasya-saamethalu/

1. టెంకాయ చెట్టు ఎందుకెక్కినావురా అంటే దూడగడ్డికి అన్నాడట

2. తడిక లేని ఇంట్లోకి కుక్క దూరినట్టు

3. విసర్రాయే గాలికి కొట్టుకుపోతుంటే విస్తరాకు సంగతి చెప్పాలా?

4.మా ఇంటాయనకి ఎంత మతిమరుపంటే నీళ్ళలో పడి ఈదడం మర్చిపోయాడు.

5. పంచ పాండవులంటే నాకు తెలియదా? మంచం కోళ్ళ వలె ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించి ఒకటి మడిచాడట.

6. అడవి పంది చేను మేసి పోతే ఊర పంది చెవులు కోసినట్టు.

7. అత్తకు లేక అటుకులు నాకుతుంటే అల్లుడు వచ్చి దసరా పండుగ అన్నాడట.

8. ఇల్లు కాలి ఇల్లాలు ఏడుస్తుంటే బొగ్గుల వ్యాపారి బేరానికి వచ్చాడట.

9. ఎద్దులాగున్నావు తేలు మంత్రం ఎరుగవా అన్నాడట.

10. ఎందుకు ఏడుస్తున్నావురా కొడకా అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతుందని అన్నాడట.

11. నాన్పుడు గాడు నా పెళ్ళికి నేను వెళ్ళాలా అడిగాడట.

12. నా చెయ్యి నొస్తున్నది, నీ చేత్తో మొత్తుకో (మొట్టికాయలు).

13. నాకింత గంజి పోస్తావా నీకు ఆకలి లేకుండా చేస్తా అన్నాడట.

14. దొంగకు తలుపు తీసి దొరను లేపే వాడు.

15. జీతం లేకుండా తోడేలు గొఱ్ఱెలు కాస్తా అనిందట.

శివ శివ శంకర…

చిత్రం – డమరుకం, రచయిత – జొన్నవిత్తుల గారు, గాయకుడు – శంకర్ మహదేవన్ గారు.

గీతం: దీనికి వ్యాఖ్య మరియు పదవిభజన గీతం కింద ఉంది

సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పర, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకర..

సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పర, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకర..

శివ శివ శంకర, హర హర శంకర, జయ జయ శంకర దిగిరారా..ప్రియ తాండవ శంకర, ప్రగడ శుభంకర, ప్రళయ భయంకర దిగిరారా..

ఓం.. పరమేశ్వరా పరా, ఓం నిఖిలేశ్వరా హరా, ఓం జీవేశ్వరేశ్వరా కనరారా..ఓం మంత్రేశ్వరా స్వరా, ఓం యంత్రేశ్వరా స్థిరా, ఓం తంత్రేశ్వరామరా రావేరా..ఆఆఆఆ..

శివ శివ శంకర, హర హర శంకర, జయ జయ శంకర దిగిరారా..ప్రియ తాండవ శంకర, ప్రగడ శుభంకర, ప్రళయ భయంకర దిగిరారా..

సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పర, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకర..

సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పర, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకర..

ఆకాశలింగమై ఆవహించరా, ఢమ ఢమఢమమని ఢమరుకధ్వని సలిపి, చణతని వదిలించరా..

శ్రీ వాయులింగమై సంచరించరా, అణువణువణువున తన తనువున నిలిచి, చలనము కలిగించరా..

భస్మం చేసే, అసురునే అగ్ని లింగమై బలికారా,

వరదై, ముంచెయ్, జలలింగమై ఘోరా..

వరమై, వశమై, ప్రబలమౌ భూలింగమై బలమిడరా, జగమే నడిపే పంచభూత లింగేశ్వరా కరుణించరా..

శివ శివ శంకర, హర హర శంకర, జయ జయ శంకర దిగిరారా..ప్రియ తాండవ శంకర, ప్రగడ శుభంకర, ప్రళయ భయంకర దిగిరారా..

సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పర, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకర..

విశ్వేశలింగమై కనికరించరా, విధిలిఖితమునిక పర పరపర చెరిపి అమృతమె కురిపించరా..

రామేశలింగమై మహిమజూపరా, పలుశుభములగని అభయమునిడి హితము, సతతము అందించరా..

గ్రహణం, నిధనం మాపరా కాళహస్తి లింగేశ్వరా, ప్రాణం,నీవై, ఆలింగనమ్మియిరా..

ఎదలో, కొలువై, హర హరా ఆత్మలింగమై నిలబడరా, ధృతివై, గతివై, సర్వ జీవ లోకేశ్వరా రక్షించరా..

శివ శివ శంకర, హర హర శంకర, జయ జయ శంకర దిగిరారా..ప్రియ తాండవ శంకర, ప్రగడ శుభంకర, ప్రళయ భయంకర దిగిరారా..

శివ శివ శివ శివ, హర హర హర హర, జయ జయ శంకర దిగిరారా..ప్రియ తాండవ శంకర, ప్రగడ శుభంకర, ప్రళయ భయంకర దిగిరారా..

సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పర, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకర..

సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పర, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకర..

పంచభూత లింగాలు:

పంచభూతాలు ఆకాశం, గాలి(వాయువు), అగ్ని, నీరు (జలం), భూమి. ఒక్కొక్కటి గా వీటి గురించి ప్రస్తావించారు.

1. ఆకాశం అంతటా ఉంటుంది (ఆవహించి ఉండడం) మరియు శబ్దాన్ని (Sound) పారనిస్తుంది (Conductor of Sound). అందుకే ఢమఢమ ధ్వని గురించి ప్రస్తావించారు. ఆకాశలింగ క్షేత్రం చిదంబరం లో ఉంది.

2. గాలి (వాయువు) సంచరించే స్వభావం కలది. ఒక చోట ఉండదు. అందుకే మనసుని గాలితో పోలుస్తారు – అది కూడా స్థిర పరుచుకోవడం కష్ఠం కనుక. హనుమంతుడు వాయునందనుడు (వాసుదేవుని అంశ తో జన్మించిన వాడు కనుక స్థిరచిత్తం (Stable mind) కోసం ఆంజనేయుడిని ప్రార్థిస్తాము ఇలా:

బుద్ధిర్బలం (Strength of mind)

యశోధైర్యం (యశః – కీర్తి, ధైర్యం – Courage)

నిర్భయత్వం (Fearlessness)

అరోగతాం (Without any diseases – Healthy) – అజాడ్యం (న జాడ్యం – జడత్వం – బద్ధకం పోగొట్టడానికి),

వాక్పటుత్వం (వాక్ + పటుత్వం – Power of speech) చ,

హనుమత్స్మరణాద్భవేత్ – హనుమత్ + స్మరణాత్ + భవేత్ – హనుమంతుడిని స్మరించడం (తలుచుకోవడం) వల్ల లభిస్తుందని అర్థం.

అలాంటి గాలి అణువు అణువునా (In the smallest of the atoms) నిలిచి, చలనము (కదలిక) కలిగించమని దీని అర్థం.

వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి లో ఉంది (తిరుపతి దగ్గర)

అగ్ని, జల, భూ లింగాల శ్లోకాలు స్వయం విశ్లేషకాలు (Self Explanatory). అందుకని మళ్ళీ ప్రస్తావించటం లేదు.

అగ్ని లింగ క్షేత్రం అరుణాచలం (తిరువణ్ణామలై) లో ఉంది.

జల లింగ క్షేత్రం జంబుకేశ్వరంలో (శ్రీరంగం వద్ద) ఉంది.

భూ లింగ క్షేత్రం కంచిలో ఉంది.

పద విభజన: తప్పులుంటే చెప్పండి

1. సర్పప్రావృత – సర్ప + ప్ర + ఆవృత – ఆవృతం అంటే చుట్టబడడం. అంటే పాముచే చుట్టబడిన వాడు (మెడ చుట్టూ పాము కలవాడు).

2. దర్పప్రాభవ – దర్పం అంటే గర్వం (Royal look). ప్రాభవం అంటే దొరతనం. శివుడి గాంభీర్యాన్ని సూచిస్తుంది.

3. దిక్పూరప్రద కర్పూరప్రభ – దిక్ + పూర – దిక్కులను పూరించేంత (నింపేసే అంత) కర్పూర దీపం తో వచ్చే ప్రభ (వెలుగు) అర్పిస్తామని అర్థం.

4. ప్రియ తాండవ శంకర, ప్రగడ శుభంకర, ప్రళయ భయంకర – ఇష్ఠమైన తాండవం చేసే వాడు, అందరికీ శుభం కలిగించే వాడూ మరియు ప్రళయ కాలమునందు భయంకరమైన వాడు అని అర్థం.

5. విధిలిఖితమునిక పర పరపర చెరిపి – విధి + లిఖితముని + ఇక – విధి (fate) ద్వారా లిఖించబడిన అంటే మన తలరాత ని పరపర చెరిపి అంటే పూర్తిగా తుడిపివేయగలవాడు అని అర్థం – తీవ్రత (intensity) కోసం ఇలా చెప్పారు.

6. పలుశుభములగని అభయమునిడి హితము, సతతము అందించరా.. పలుశుభములను + కని అభయమును + ఇడి (ఇచ్చి) హితము, సతతము అందించరా – అంటే చాలా శుభములను కని, అభయము (Assurance of Safety) ని ఇచ్చి హితము (మంచి) ని సతతము (ఎప్పుడూ) అందించేవాడు అని అర్థం.

7. గ్రహణం, నిధనం మాపరా కాళహస్తి లింగేశ్వరా: ఏ గ్రహణం (సూర్య గ్రహణం కానీ చంద్ర గ్రహణం కానీ) (Solar or Lunar Eclipse) వచ్చినా ప్రపంచం లోని దేవాలయాలన్నిటిని గ్రహణ సమయంలో మూసి ఉంచుతారు. ఆ సమయంలో పూజలు, పునస్కారాలు, సేవలు, ఉండవు. కానీ శ్రీకాళహస్తి లోని వాయులింగం (ఎందుకంటే లింగం లోంచి వాయువు వస్తూ పక్కన ఉన్న దీపాన్ని వెలిగిస్తూ ఉంటుంది) గా పూజింపబడే శివుడి ఆలయం మాత్రం మూయరు. అన్ని సంస్కారాలు,  యథావిథి (As it is) గా జరుగుతాయి. కాళహస్తీశ్వరుడికి అంత శక్తి. అంటే గ్రహణాన్ని నిధనం (నాశనం) చేయగలవాడు అని అర్థం. ఇక్కడ గ్రహణం అంటే మనసుకు పట్టిన చీకటి అనుకోవచ్చు. చీకటి తొలగించేవాడు అని అర్థం.

8. ప్రాణం,నీవై, ఆలింగనమ్మియిరా: ఆలింగనము + ఇయ్ రా – అంటే నువ్వే ప్రాణమై కౌగిలించుకోమని (ఆలింగనం అంటే కౌగిలింత) అన్నమాట.

ఓర్పుగా చదివినందుకు కృతజ్ఞతలు.

ఇటువంటిదే అయిన “మహాప్రాణ దీపం” అనే ఇంకో గీతాస్తోత్రానికి కూడా దీనికిముందు వ్యాఖ్యానం రాశాను. మీకు ఇది నచ్చినట్లయితే దాన్ని కూడా చదవండి. లింక్ ఈ కింద ఉంచాను – మీ అభిప్రాయమేదైనా ఉంటే కామెంట్స్ లో తెలపండి:

http://teluguvanam.in/2024/09/21/mahaapraanadeepam/

ఎవరది ఎవరది…

చిత్రం – సీత. గాయకుడు – హరిచరణ్.

ఎవరది ఎవరది ఎదనదిలో..ఎదలను వరదను నింపినది….

నిజమేనా నిజమే..నా..ఎగిసే జ్వాలగా, మనసైనదా..మనసుంటే, చితిమంటే..తియ్యని ప్రేమలో, విషమున్నదా..

బ్రతుకే ఎదురీతలో, ఓడిందే..విధిరాతలో..నీ వల్లే..నీ వల్లే..కన్నీటి కాలకూటం..

ఓ నిజమేనా నిజమే..నా..ఎగిసే జ్వాలగా, మనసైనదా..మనసుంటే, హో..చితిమంటే..తియ్యని ప్రేమలో, విషమున్నదా..

శ్రీ ఆంజనేయం…

చిత్రం – ఊసరవెల్లి, రచన – సీతారామ శాస్త్రి గారు.

శ్రీ ఆంజనేయం, భజే వజ్రకాయం, సదా రక్షగా కాపాడనీ నీ నామధేయం..శ్రీ ఆంజనేయం, భజే వాయుపుత్రం, సదా అభయమై అందించరా నీ చేతి సాయం..

ఓ..భజరంగభళి, దుడుకున్నదిగా నీ అడుగులలో, నీ.. సరి లేరని చూపర ఆశయసాధనలో…ఓ తప మానసిక, పెను సాహసముందిగ పిడికిలిలో, లే.. పని చెప్పర దానికి విషమ పరీక్షలలో..

స్ఫురణ తెచ్చుకొని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును దించగ రా.. నివురునొదిలి శివ ఫాలనేత్రమై దనుజ దహనమున కై దూసుకురా..

స్ఫురణ తెచ్చుకొని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును దించగ రా.. నివురునొదిలి శివ ఫాలనేత్రమై దనుజ దహనమున కై దూసుకురా..

శ్రీ ఆంజనేయం, భజే వజ్రకాయం, దండించాలి రా దండధారివై దుండగాల దౌష్ఠ్యం…శ్రీ ఆంజనేయం, భజే వాయుపుత్రం, పూరించాలిరా నీ శ్వాస తో ఓంకార శంఖం..

ఆ..బ్రహ్మాస్త్రము సైతం వమ్మవదా నీ సన్నిథి లో.. ఆ..యమపాశమె పూదండవదా నీ మెడలో….నీ..వు నమ్మిన తారక మంత్రము ఉన్నది హృదయములో.. అదే.. రహదారిగ మార్చద కడలిని పయనం లో..

శ్రీ ఆంజనేయం, భజే వజ్రకాయం, సదా రక్షగా కాపాడనీ నీ నామధేయం..భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం, సదా అభయమై అందించరా నీ చేతి సాయం..

అదేంటొ ఒక్కసారి…

చిత్రం – స్వామి రారా. గాయకుడు – సన్నీ.

అదేంటొ ఒక్కసారి ఊపిరాగిపోయినట్టు… హఠాత్తు గానె మనసు కుప్పిగంతులేసినట్టు..కుమారి సోయగాలు దాచలేవు కళ్ళు మూసిఇఈఈఈఇఈఈఈఈ, షుమారు తారలన్ని నేలరాలె నిన్ను చూసిఈఈఈఈ..

ప్రశ్నల్తో చంపే రాకాసి, గుప్పెట్లో దాచా నచ్చేసి..నీలా, ఎవరు, లేనే, లేరు, ప్రేమో, ఇది ఏమో, హమ్మో ఏందమ్మో..

అందం,చందం, తెలుగు బుట్టబొమ్మ ధన్యం, కాదా, పాతికేళ్ళ జన్మ కళ్ళే,కలిపావొ..కళే కళ, ఎపుడు చూడలేదు ఇదో విధం, కొత్తపిచ్చి లెద్దూ తుళ్ళే..సంతోషంఊఊ…పాలరాతి పైన పాదం, కందిపోయెనేంటొ పాపం, ఊరుకోదు ఉన్న ప్రాణం, ఇసుకరేణువైన నీకు కాలికింద గుచ్చుకుంటె.

నీలా, ఎవరు, లేనే, లేరు, ప్రేమో, ఇది ఏమో, హమ్మో ఏందమ్మో..

వేళకాని వేళ గోల, ప్రేమలోనె గొప్ప లీల, ఓ బేల, కోపాలాఉఉ..చల్లగాలి చంప మీద, చెయ్యె చేసుకుంది నీకై చూడంటూఊ.. లేతగోళ్ళ కన్నెపిల్ల, లోతుకళ్ళు చంపేలా,కాటుకైన లేని వేళ..నీ దిష్ఠి తీసి లక్షణంగా అష్ఠపదులు పాడుకుంటా.

నీలా, ఎవరు, లేనే, లేరు, ప్రేమో, ఇది ఏమో, హమ్మో ఏందమ్మో..

నీలా, ఎవరు, లేనే, లేరు, ప్రేమో, ఇది ఏమో, హమ్మో ఏందమ్మో..

ఉప్పొంగెలే గోదావరి…

చిత్రం – గోదావరి, రచన – వేటూరి గారు.

షడ్జమం, భవతి వేదం.. పంచమం, భవతి నాదం.. శృతిశిఖరే, నిగమఝరే, స్వరలహరే..

ససపపపపపమనిససరిస..ససపపపపపమదపద…

ఉప్పొంగెలే గోదావరి, ఊగిందిలే చేలో వరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి..

వెతలు తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి..శబరి కలిసిన గోదారి, రామచరితకే పూదారి..ఏసెయ్ చాప జోర్సెయ్ నావ వార్సెయ్ వాలుగా..చుక్కానే చూపుగా..బ్రతుకుతెరువు ఎదురీతేగా..

ఉప్పొంగెలే గోదావరి, ఊగిందిలే చేలో వరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి..

సావాసాలు సంసారాలు చిలిపి చిలకజోస్యం, వేసే అట్లు వేయంగానె లాభసాటి బేరం..ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం, ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి హగ్గం..ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ, నది ఊరేగింపులో.. పడవ మీద నాగ, ప్రభువు తాను కాగ..

ఉప్పొంగెలే గోదావరి, ఊగిందిలే చేలో వరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి..

గోదారమ్మ కుంకం బొట్టు దిద్దె మిరప ఎరుపు, లంకానాధుడింకా ఆగనంటు పనులు కొరుకు..చూసేచూపు ఏంచెప్పింది సీతా కాంతకి, సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి..లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు, అల పాపికొండల, నలుపు కడగలేక, నవ్వు తనకు రాగా..

ఉప్పొంగెలే గోదావరి, ఊగిందిలే చేలో వరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి..

వెతలు తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి..శబరి కలిసిన గోదారి, రామచరితకే పూదారి..ఏసెయ్ చాప జోర్సెయ్ నావ వార్సెయ్ వాలుగా..చుక్కానే చూపుగా..బ్రతుకుతెరువు ఎదురీతేగా..

ఉప్పొంగెలే గోదావరి, ఊగిందిలే చేలో వరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి…..