చిత్రం – బ్రోచేవారెవరురా.
కలలనే, ఇలా, తరిమినది కారు చీకటే..కాలం తోనే, కలిసి నడిపే, నిశీధి దారిదే..
ఎటునుండి, ఎటువైపుకు కమ్మెను నేడీ సుడిగాలులే..ఓఓఓ నల్లమబ్బేదో కప్పేసి దారే మూసే వేళే..
నిను బ్రోచే, వారే, లేరులే…తుది లేని ఆటే, మాయనే..
అసలు నిమిషమైన నిజము ఆగిపోదులే..ఈ చరపలేని గురుతు రాసె విధియే..
తెలవారితే బ్రతుకేదనీ, బరి దాటుతూ తెలవారనీ..ఓఓఓ నల్లమబ్బేదో కప్పేసి దారే మూసే వేళే..
నిను బ్రోచే, వారే, లేరులే…తుది లేని ఆటే, మాయనే..
నిను బ్రోచే, వారే, లేరులే…తుది లేని ఆటే, మాయనే..
ముసురుగప్పుతున్న వింత వనం, తొలుగుతున్న ముసుగు పేరు గతం..మెదులుతున్న కధను లేదు నిజం,
అబలమంటూ మరుగుతున్న మనం, అడగలేని అడుగులోని పధం, బ్రతుకు దారి మార్చుకున్న విధం..
ఆఆఆఆఆఆఆ….